ETV Bharat / crime

Drug Addicts suicide in AP : మత్తుకు బానిసలై.. 385 మంది బలవన్మరణం

Drug Addicts suicide in AP : మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఏపీలో గణనీయంగా పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో మత్తుకు బానిసలైన 385 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లెక్కల్లో మహిళలు సైతం ఉన్నారు.

drug addicts commited suicide in ap
drug addicts commited suicide in ap
author img

By

Published : Nov 29, 2021, 9:20 AM IST

Drug Addicts suicide in AP : మత్తు పదార్థాల పరంగా మద్యం తర్వాత ఎక్కువ మంది ఉపయోగించేది గంజాయే. కొందరు ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాల్ని వాడుతున్నారు. సరదాగా మొదలుపెట్టి ఆ తర్వాత వ్యసనపరులుగా మారిపోతున్నారు. ఆ అలవాటు తీవ్రమయ్యే కొద్దీ.. వారి ప్రవర్తనలో రకరకాల మార్పులు వచ్చి.. చివరకు ఆత్మహత్మలకు దారితీస్తోంది. గతేడాది ఏపీలో రికార్డు స్థాయిలో మత్తుకు బానిసలైన 385 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2019తో పోలిస్తే 2020లో వీరి ఆత్మహత్యలు 27 శాతం పెరిగాయి. ఈ లెక్కల్లో మహిళలూ ఉన్నారు.

సరదాగా మొదలుపెట్టి...

Drug Addicts in APఏపీలో మత్తు పదార్థాల పరంగా మద్యం తర్వాత ఎక్కువ మంది ఉపయోగించేది గంజాయే. కొందరు ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాల్ని వాడుతున్నారు. సరదాగా మొదలుపెట్టి ఆ తర్వాత వ్యసనపరులుగా మారిపోతున్నారు. ఈ అలవాటు తీవ్రమయ్యే కొద్దీ.. వారి ప్రవర్తనలో రకరకాల మార్పులు వచ్చి.. చివరకు ఆత్మహత్మలకు దారితీస్తోంది. గతేడాది ఏపీలో 7,043 మంది బలవన్మరణాలకు పాల్పడగా.. వారిలో 385 మంది (5.46 శాతం) మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైన వారే కావడం తీవ్రతకు అద్దం పడుతుంది.

ఐదు రెట్లు అధికం..

  • సాధారణ వ్యక్తులతో పోలిస్తే మత్తు పదార్థాలకు బానిసలైన (drug addicts died in AP)వారిలో చనిపోవాలనుకునే ధోరణి ఐదు రెట్లు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. మద్యం, మాదకద్రవ్యాలను అధికంగా తీసుకోవటం వల్ల వీరు మానసికంగా దెబ్బతిని ఈ తరహా ఆలోచనలు చేస్తుంటారు.
  • ప్రధానంగా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారని అధ్యయనంలో తెలింది
  • గత ఏడేళ్లలో ఏపీలో మొత్తం 42,567 ఆత్మహత్య కేసులు నమోదుకాగా... వారిలో 1,600 మంది (3.75 శాతం) మద్యం, మాదకద్రవ్యాలకు (edict for drugs) బానిసలే.
  • మత్తు వ్యసనపరుల్లో 2014లో 94 మంది ఆత్మహత్య చేసుకోకున్నారు. 2020 నాటికి ఆ సంఖ్య 385కు పెరిగింది. దీన్ని బట్టి వాటి వినియోగం, పర్యవసానాలు ఎలా పెరుగుతున్నాయో అర్థమవుతుంది.
  • వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్‌, అవగాహన కల్పించటం ద్వారా ఈ ధోరణి నుంచి బాధితుల్ని(Counselling for Drug Addicts) బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా తదితర దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం- ఆత్మహత్యలు అంశంపై వివిధ సంస్థలు అధ్యయనాలు చేసి.. నియంత్రణ చర్యలను సిఫార్సు చేస్తుంటాయి. అలాంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలోనూ చేపట్టాలని విశ్రాంత పోలీసు అధికారి ఒకరు సూచించారు.
.

ఇదీ చదవండి: భర్త కొట్టడం తప్పేమీ కాదంట- మెజార్టీ తెలుగు మహిళల మాట!

తల్లిదండ్రులూ బహుపరాక్‌... మాదకద్రవ్యాల వలలో యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.