'ఛలో ట్యాంక్‌బండ్'ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆరోపించారు. ఈనెల 9న నిర్వహించబోయే కార్యక్రమానికి సన్నద్ధం చేసేందుకు... విద్యానగర్‌లోని ఈయూ కార్యాలయం ముందు ఆయన శ్రీకారం చేశారు. కార్యక్రమాన్ని విధ్వంసం చేయడానికి కార్మిక సంఘాల నాయకులను అర్ధరాత్రివేళ అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. తాము అందుబాటులో లేకుంటే... కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా... తప్పుడు సమాచారం ఇవ్వడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా కార్మికులతో చర్యలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం