ETV Bharat / city

పట్టణీకరణకు అనుకూలంగా పరిపాలన వికేంద్రీకరణ: కేటీఆర్

ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించొచ్చని అభిప్రాయపడ్డారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో టీఎస్‌-బీపాస్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు.

పట్టణీకరణకు అనుకూలంగా పరిపాలన వికేంద్రీకరణ: కేటీఆర్
పట్టణీకరణకు అనుకూలంగా పరిపాలన వికేంద్రీకరణ: కేటీఆర్
author img

By

Published : Nov 16, 2020, 1:40 PM IST

Updated : Nov 16, 2020, 2:52 PM IST

తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌-బీపాస్‌ను పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు. కొంతకాలంగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌ ఉత్తమ ఫలితాలు ఇవ్వడంతో తాజాగా పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు.

తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఈ వెబ్‌సైట్‌ రూపొందించారు. దీంతో ఇకపై దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో నిర్దేశించిన గడువులోగా టీఎస్‌బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతులు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలో అధికారులు ప్రత్యేకంగా చూపించారు.

రెండు, మూడు నెలల్లో..

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో 58శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని అన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టామన్నారు. పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకున్నామని, ఇలాంటి విధానం దేశంలో మరెక్కడా లేదని కేటీఆర్‌ చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో నూతన జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తామన్నారు. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించొచ్చు’’ అని కేటీఆర్‌ అన్నారు.

టీఎస్‌-బీపాస్‌ విధానం కింద 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనానికి ఎలాంటి అనుమతీ అవసరం ఉండదు. కేవలం రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది. 600 గజాలలోపు, పదిమీటర్ల కంటే తక్కువ ఎత్తుండే నివాస గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి లభించనుంది.

600 గజాల స్థల విస్తీర్ణం కంటే ఎక్కువ, పది మీటర్ల కంటే ఎత్తైన, ఇతర నివాసేతర భవనాలకు 21 రోజుల్లో నిర్మాణ అనుమతులు ఇవ్వనున్నారు. వెబ్‌సైట్‌, మీ-సేవా కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని పౌరసేవా కేంద్రాలు, ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చే యాప్‌ ద్వారా టీఎస్‌-బీపాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టం-2019తో పాటు టీఎస్‌-బీపాస్‌ చట్టాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఇవీ చూడండి: సందిగ్ధంలో సాదాబైనామా.. క్రమబద్ధీకరణ జరిగేనా?

Last Updated : Nov 16, 2020, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.