ETV Bharat / city

మోదీది బేచో ఇండియా... తమది సోచో ఇండియా: కేటీఆర్​

భాజపాపై ఛార్జ్​షీట్​ వేయడానికి యాభై అంశాలున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అబద్ధాలు, అర్థ సత్యాలతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భాజపా నేతలు గోబెల్స్​కు కజిన్ బ్రదర్స్​లా వ్యవహరిస్తున్నరని దుయ్యబట్టారు. భాజపాకు అవకాశం ఇస్తే గోల్కొండ, చార్మినార్, జీహెచ్ఎంసీలను కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ప్రధాన పోటీ ఎంఐఎంతోనేనని పేర్కొన్నారు.

జీహెచ్​ఎంసీ మేయర్​గా తెరాస మహిళ కార్పొరేటరే: కేటీఆర్​

author img

By

Published : Nov 24, 2020, 7:09 PM IST

భాజపా నేతలు గోబెల్స్​కు కజిన్ బ్రదర్స్​లా వ్యవహరిస్తున్నారని... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​ అబద్ధాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెరాస, ఎంఐఎం సర్కారు అని పేర్కొనడం... ముస్లింలపై భాజపా వ్యతిరేకతను బయట పెడుతోందన్నారు. జమ్మూ కశ్మీర్​లో వేర్పాటువాదులతో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెరాసపై దేనికి ఛార్జ్​షీట్ వేస్తారు... ప్రగతి పథంలో దూసుకెళ్తున్నందుకా? అని మండిపడ్డారు.

హైదరాబాద్​కు కేంద్రం నుంచి ఒక్క పైసా అదనంగా ఇచ్చారేమో కిషన్ రెడ్డి కానీ కేంద్ర మంత్రులెవరైనా సూటిగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఛార్జ్​షీట్ వేయాలంటే భాజపాపై చాలా అంశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నందుకు భాజపాపై ఛార్జ్​షీట్ వేయాలన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో చార్మినార్, గోల్కొండ, జీహెచ్ఎంసీని కూడా భాజపా అమ్ముతుందని ధ్వజమెత్తారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నిలబెట్టుకోనందుకు... 12 కోట్ల మంది నిరుద్యోగులు మోదీపై ఛార్జ్​షీట్ వెయ్యాలన్నారు. కరోనా ప్యాకేజీలు, జన్​ధన్ ఖాతాల్లో సొమ్ము జమ పేరుతో మోసం చేసినందుకు వ్యాపారులు, పేదలు ఛార్జ్​షీట్​ దాఖలు చేయాలన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, నవోదయ పాఠశాలల కేటాయింపులో మొండిచేయి.. ఐటీఐఆర్ రద్దు, రైతు వ్యతిరేక చట్టాలపై ఛార్జ్​షీట్​ దాఖలు చేయాలని ఎదురుదాడి చేశారు. వరద సాయం చేయనందుకు, రోడ్ల అభివృద్ధికి అడ్డుపడుతున్నందుకు అంటూ... యాభై అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు.

మోదీది బేచో ఇండియా... తమది సోచో ఇండియా నినాదమని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ఎంఐఎంతోనే ప్రధాన పోటీ అన్నారు. తెరాస మొదటి స్థానం.. ఎంఐఎం రెండో స్థానంలో ఉంటాయని.. మిగతా స్థానాల కోసం మిగతా పార్టీలు తేల్చుకోవాలన్నారు. గ్రేటర్ పీఠంపై తెరాస మహిళ కార్పొరేటర్ మేయర్​గా ఉంటారని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి: 'ఓట్లు, సీట్ల కోసం మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.