తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో విద్యుత్ కార్మిక సంఘం సమావేశానికి... విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యుత్‌శాఖలోని ఆర్టిజన్స్ ఉద్యోగులను తెరాస ప్రభుత్వం రెగ్యలర్ చేసిందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రాంలో విద్యుత్ కష్టాలు ఎలా ఉండేవో అందిరికీ తెలిసిందేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అప్పట్లో పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్ హాలిడే ఉండేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తెంలగాణకు రావాల్సిన జలవిద్యుత్ కేంద్రాన్ని విభజన సమయంలో ఏపీలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత... తెరాస అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యనే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా... దేశంలోనే ఘనత సాధించామన్నారు. దీంతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ... దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. వందశాతం ఇంటింటికి మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం ప్రకటించడం గర్వకారణం అన్నారు.
ఇదీ చూడండి: వారణాసి పర్యటనలో సీఎం కేసీఆర్ కుటుంబం