ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 11, 2022, 3:02 PM IST

  • జనగామలో సీఎం కేసీఆర్​ పర్యటన..

cm kcr visits Jangaon: జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. యశ్వంతాపూర్‌ వద్ద నిర్మించిన జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కేసీఆర్ రాకతో పట్టణమంతా గులాబీమయమైంది.

  • కేసీఆర్​ ఎందుకు బయటకు రాలేదు..

Revanth Reddy Fired On Kcr: చట్ట సభల విలువలను కాలరాస్తూ తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానిస్తుంటే.. సీఎం కేసీఆర్​ ఎందుకు బయటకు రావట్లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు మొక్కుబడిగా నల్ల జెండాల ప్రదర్శన చేశారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ గాంధీ భవన్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్​.. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్​ అంటకాగారని విమర్శించారు.

  • డిప్లమా సెమిస్టర్ పరీక్షా పేపర్‌ లీక్​..

రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో డిప్లమా సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది. అబ్దుల్లాపూర్​మెట్ మండల పరిధిలోని బాటసింగారంలోని స్వాతి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇంజినీరింగ్ గణితం ప్రశ్నా పత్రాలు లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్​లో ప్రశ్నాపత్రం గుర్తించిన విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

  • ఇతర రాష్ట్రాలకూ హిజాబ్ వివాదం..

Hijab row: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముంబయిలోని ఓ కాలేజీ తాము హిజాబ్​, బుర్ఖాను నిషేధిస్తున్నట్లు ప్రకటించడం దుమారానికి దారితీసింది. మధ్యప్రదేశ్​లోనూ ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం ఈ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వానికి సూచించింది. తరగతి గదుల్లో ఎలాంటి మతపరమైన వస్త్రాలు ధరించవద్దని స్పష్టం చేసింది.

  • వివాదాస్పద తీర్పుల జడ్జి రాజీనామా..

Justice Pushpa Ganediwala: దుస్తులపైనుంచి తాకితే లైంగిక వేధింపులుగా భావించలేమంటూ వివాదాస్పద తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు. అదనపు జడ్జిగా పదవీకాలం ముగిసే ఒక్క రోజు ముందే రాజీనామా చేయటం గమనార్హం.

  • క్రికెట్​ బాల్​ కోసం ఊరంతా లొల్లి..

Fight for cricket ball: క్రికెట్ బాల్​ కోసం ఓ గ్రామంలోని రెండు వర్గాల ప్రజలు పరస్పరం దాడి చేసుకున్నారు. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • ఎయిర్​టెల్​ సేవలకు బ్రేక్..

Airtel Outage: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్​ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్​టెల్​ నెట్‌వర్క్‌ అంతరాయంపై ట్విట్టర్​ వేదికగా ఫిర్యాదు చేశారు.

  • ఎల్‌ఐసీ ఐపీఓ కోసం వెయిటింగా?

LIC IPO Shares discount: మరికొన్ని రోజుల్లోనే ఎల్​ఐసీ పబ్లిక్​ ఇష్యూకు రానుంది. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారుల కోసం ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతోంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేరు ధరలో 5-10 శాతం రాయితీ సైతం ఇవ్వనున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. అయితే రాయితీలో షేర్లను దక్కించుకోవడం ఎలా?

  • సిరిస్​ను క్లీన్​స్వీప్​ చేసేనా..

India vs West Indies: వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్​ గెలిచిన టీమ్​ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​ గెలిచి రోహిత్​ సేన సిరీస్​ క్లీన్​స్వీప్​ చేయాలని భావిస్తోంది.

  • రణ్​బీర్​తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది..

Alia ranbir wedding: ప్రియుడు రణ్​బీర్​తో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ ఆలియా భట్. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.