ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Jan 26, 2022, 3:10 PM IST

  • డ్రగ్స్​ అనే మాటే వినపడొద్దు..

తెలంగాణలో డ్రగ్స్‌ అనే మాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సూచించారు. దీనిలో భాగంగా శుక్రవారం 'స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్‌' జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డ్రగ్స్ నియంత్రణ చర్యలపై హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డీజీలు, ఎస్పీలు, సీపీలతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. సమీక్షకు ఎక్సైజ్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరవనున్నారు. డ్రగ్స్ నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణ.. డ్రగ్స్ నివారణ విధివిధానాలపై చర్చించనున్నారు.

  • జిల్లాలకు తెరాస కొత్త అధ్యక్షులు వీళ్లే..

తెలంగాణలోని జిల్లాలకు తెరాస అధినేత కేసీఆర్.. పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. 33 జిల్లాలకు తెరాస అధ్యక్షులను నియమించారు. ఏయే జిల్లాలకు ఎవరిని నియమించారంటే..

  • రాష్ట్రమంతా మువన్నెల జెండా రెపరెపలు..

Republic day celebrations 2022: రాష్ట్రవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు...అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

  • ప్రభుత్వం శరీరం.. రాజ్యాంగం ఆత్మ..

Republic day celebrations in Basavatarakam Hospital: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో 73వ గణతంత్ర వేడుకలు జరిగాయి. ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌- బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • పద్మ పురస్కారాలు మకొద్దు..

Padma Awards Refused: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను స్వీకరించేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. తాజాగా బంగాల్​కు చెందిన ప్రముఖ తబలా వాద్యకారుడు పండిట్​ అనింద్య ఛటర్జీ ఆ జాబితాలో చేరారు.

  • ఆర్​ఆర్​బీ పరీక్షలో 'అక్రమాల'పై ఆగ్రహం

RRB Exam Scam Protests: ఆర్​ఆర్​బీ పరీక్షల వ్యవహారం బిహార్​లో తీవ్ర హింసకు దారితీసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ గయాలో నిరసనలకు దిగిన ఉద్యోగార్థుల్లో కొందరు.. విధ్వంసానికి పాల్పడ్డారు.

  • 7 రోజుల్లో 2 కోట్లకు పైగా కేసులు..

WHO On Omicron Virus: ఒక్కవారం వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా బలపడుతోందని హెచ్చరించింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్​లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది.

  • హైదరాబాద్‌ నుంచి తొలి ‘యూనికార్న్‌’గా..

Darwin's Box Success Meet: తెలంగాణా నుంచి సాస్‌ విభాగ అంకుర సంస్థ, ‘యూనికార్న్‌’ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి తొలి ‘యూనికార్న్‌’గా డార్విన్‌బాక్స్‌ సంస్థ నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

  • ఆరేళ్ల తర్వాత ఆ క్రికెటర్​ రీఎంట్రీ..

IND VS WI RishiDhawan: స్వదేశంలో వెస్టిండీస్​తో జరగనున్న సిరీస్​లో రిషి ధావన్​, షారుక్​ ఖాన్​లను ఎంపిక చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు క్రికెట్​ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రిషి దాదాపుగా ఆరేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.

  • రాధేశ్యామ్​.. ఓటీటీలోనా.. థియేటర్​లోనా..

Radhe shyam OTT: 'రాధేశ్యామ్' సినిమా ఓటీటీలో రిలీజ్​ అంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఓ నెటిజన్​ ట్వీట్​కు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.