ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,702 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఏపీలో కొవిడ్ కేసుల సంఖ్య 8,90,692కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు.
ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,174కు చేరింది. 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,36,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు: బండి