ఈసారి ద్వాదశాదీత్యుడి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణనాథుడి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈనెల 26లోపు పనులన్నీ పూర్తి చేస్తామని.. వినాయకచవితికి ఒక్కరోజు ముందు స్వామివారి నుంచి కర్రలను తొలగిస్తామని ప్రముఖ శిల్పి సుదర్శన్ తెలిపారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతిని రూపొందిస్తున్నామన్నారు. ఈ రూపంలో వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడతాయని, అందరికీ మంచి చేకూరుతుందని సిద్ధాంతి గౌరిపట్ల విఠల శర్మ తెలిపారని చెప్పారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 61 అడుగుల మహాగణపయ్య నిర్మాణం, విగ్రహ విశిష్టత, ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు...
- ఇదీ చూడండి : స్విగ్గీలో బీర్.. అడ్డంగా దొరికిపోయిన చోర్!