ETV Bharat / city

KTR on Cantonment Development : 'కంటోన్మెెంట్ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది'

author img

By

Published : Feb 12, 2022, 2:06 PM IST

KTR Comments about Cantonment Development: పేదలకు పట్టాలు ఇద్దామంటే స్థలం ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడటం సరైంది కాదని హితవు పలికారు. సికింద్రాబాద్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/12-February-2022/14445505_thu.png
KTR on Cantonment Development

KTR Comments about Cantonment Development: కంటోన్మెంట్‌ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. పేదలకు పట్టాలు ఇద్దామంటే స్థలం ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతోందని పురపాలకమంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్​లో ఉచిత మంచి నీటి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, నాలాలు అభివృద్ధి చేద్దామన్నా కేంద్రం సహకరించట్లేదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడొద్దని కోరారు.

దయచేసి అడ్డుపడొద్దు..

KTR Comments Comments on Central Govt : 'కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంటే.. ప్రగతికి అడుగులు పడకుండా అడుగడుగునా కేంద్రం అడ్డుపడుతోంది. కంటోన్మెంట్ రోడ్లను మూసివేయడం.. పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడం.. స్కై వేకు అనుమతులు ఇవ్వకపోవడం.. ఇలా ప్రతి పనికి అడ్డువస్తోంది. మీరు అనుమతి ఇవ్వకపోయినా మా పోరాటం ఆగదు. మా ప్రగతి ఆగదు. రాష్ట్ర సర్కార్ నుంచి ఏ మేరకు అభివృద్ధి సాధ్యమవుతుందో.. పక్కాగా అది చేస్తాం. కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేశాం. కంటోన్మెంట్ ప్రజల తరఫున మరోసారి కోరుతున్నాం. దయచేసి రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడొద్దు.'

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

ప్రగతికి శ్రీకారం..

KTR on Cantonment Development : సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. రసూల్‌పురాలో నాలా అభివృద్ధి పనులకు, పాటిగడ్డలో మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ పనులకు శుంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న పాల్గొన్నారు.

ఇల్లూ.. పెళ్లీ.. కేసీఆరే చేస్తున్నారు..

'హైదరాబాద్​లో ఎక్కడికిపోయినా.. ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు. కేసీఆర్ మాత్రం.. ఆ రెండు నేనే చేస్తా.. మీరేం దిగులు పడకండి అంటుండ్రు. కేసీఆర్ నాయకత్వంలో నగరం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. 10 లక్షల ఆడబిడ్డల కోసం రూ.8వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే'

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

కంటోన్మెెంట్ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.