కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల్లో భాగంగా డ్రైనేజీ, తదితర నిర్మాణాలకు భూసేకరణ(land acquisition for Kaleshwaram additional TMC works)పై హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 27న ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన అయిదుగురు హైకోర్టును ఆశ్రయించారు.
రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటి ఎత్తిపోతల కోసం డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తున్న సమయంలో... అదనపు టీఎంసీకి ప్రతిపాదనలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సామర్థ్యం పెంచే ముందు డీపీఆర్ రూపొందించకపోవడంతో పాటు.. పర్యవరణ అనుమతులు తీసుకోలేదన్నారు. అనమతుల్లేకుండా పనులు చేపట్టవద్దంటూ ఎన్జీటీ ఉత్తర్వులు కూడా ఇచ్చిందన్నారు. అయినప్పటికీ తమ భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు.
అనుమతుల్లేకుండా పనులు ఎలా చేపడుతున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. అప్పటి వరకు భూసేకరణ చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: