ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(cm jagan)పై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా.. విజయవాడ(vijayawada)లోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి(tdp official spokesperson Pattabhi) ఇంటిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఆయన ఇంట్లోని సామగ్రిని, ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తమ ఇంటిపై దాడి చేశారని పట్టాభి కుటుంబసభ్యులు తెలిపారు.
మా ఇంటిపై 200 మంది దాడి చేశారు. పట్టాభి దొరికితే చంపేస్తామని హెచ్చరించారు. గట్టిగా కేకలు వేస్తూ సామగ్రి ధ్వంసం చేశారు.
- పట్టాభి కుటుంబసభ్యులు
అసలు వివాదమేంటి..?
మంగళవారం ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశం(pattabhi press meet)లో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(nakka anand babu)కు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు పలు ప్రాంతాల్లో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే హిందూపురం, విశాఖపట్నంలో వైకాపా కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో ఉన్న పట్టాభి నివాసంలోనూ కొందరు వైకాపా శ్రేణులు దాడి చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది.
ఇదీ చదవండి: Asaduddin owaisi cricket: భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్‌పై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు