ETV Bharat / city

'కొడుకా... ఆకలి అవుతుంది.. అన్నం పెట్టు..'

ముగ్గురు కొడుకులు ఉండి కూడా అనాథైంది. అన్నం పెట్టే దిక్కులేదు.. చలేస్తే దుప్పటి ఇచ్చేవారు లేక బోరున ఏడుస్తుందా తల్లి. అమ్మను వద్దనుకుని బస్ షల్టర్​లో వదిలి వెళ్లారు ఆ పుత్రులు.. ఈ విషాద ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో జరిగింది.

కొడుకా ఆకలి అవుంతుంది.. అన్నం పెట్టు..'
కొడుకా ఆకలి అవుంతుంది.. అన్నం పెట్టు..'
author img

By

Published : Aug 20, 2020, 4:36 PM IST

'అయ్యా...కొడుకా ఆకలి అవుంతుంది అన్నం పెట్టండి... చలేస్తుంది అయ్యా దుప్పటి కావాలి.. నా కొడుకులు నన్నొదిలేశారు.. నాకన్నం పెట్టండయ్యా..' - కొడుకులు వదిలేసిన తల్లి ఆవేదన ఇది

కన్న కొడుకులు ఉండి కూడా ఆ తల్లి రోడ్డు మీద పడింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు బస్ షెల్టర్​లో... ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మల్లమ్మ అనే వృద్ధురాలు దీనంగా పడి ఉంది. గ్రామంలో వచ్చే పోయేవారిని చూసి... కొడుకా ఆకలి అవుతుంది అన్నం పెట్టు...అంటూ ఏడుస్తోంది. ఆ తల్లి దీన స్థితి చూసి స్థానికులు ఆమె ఆకలి తీరుస్తున్నారు. ముగ్గురు కుమారులు ఉన్నారని రెండు రోజుల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్లారని ఆమె చెప్తూ కన్నీటి పర్యంతమైంది.

ఆసుపత్రిలో చేర్పించి తనకు సహాయం చేయాలని వేడుకొంటుంది. మతిస్థిమితం లేదని ఇక్కడ వదిలేశారని ఆమె వాపోయింది. ప్రత్తిపాడు ఎస్సై అశోక్​కు స్థానికులు సమాచారం తెలిపారు. ఆయన అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా కాలం.. చిల్లర లేనిదే చితి కాలదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.