ETV Bharat / city

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

author img

By

Published : Mar 30, 2021, 10:22 PM IST

మోడల్​ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్​ జారీ అయింది. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు జూన్​ 5న, ఆరో తరగతి కోసం జూన్​ 6న పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరో తరగతి కోసం ఏప్రిల్ 15 నుంచి 30 వరకు.. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఏప్రిల్ 20 నుంచి 30 వరకు ఆన్​లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

model schools entrance exams notification

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం జూన్ 6న, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు జూన్ 5న ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఆరో తరగతి కోసం ఏప్రిల్ 15 నుంచి 30 వరకు.. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఏప్రిల్ 20 నుంచి 30 వరకు ఆన్​లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ తెలిపారు.

జూన్ 1 నుంచి 6 వరకు వెబ్​సైట్​లో నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 18 నుంచి 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. జూన్ 21న మోడల్ స్కూళ్లలో తరగతులు ప్రారంభమవుతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 75 రూపాయలు, ఇతరులు 150 రూపాయలు ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్ సైట్ పరిశీలించాలని డైరెక్టర్ తెలిపారు.

ఇదీ చూడండి: 'సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్నికలు జరగనివ్వం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.