గాంధీ ఆస్పత్రిలో 18 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 15 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తులు 18 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిన్న రాత్రి సమయంలో కిడ్నాపర్లు గాంధీ ఆస్పత్రి ఆరోగ్య విభాగం బయట చిన్నారిని వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫూటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కిడ్నాప్ తెలిసిన వారే చేసి ఉంటారని వారు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: హేమంత్ సోరెన్‌కు కేసీఆర్,కేటీఆర్ శుభాకాంక్షలు