ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. పోలీసుల విధులను ప్రశంసిస్తూ పాట పాడారు. పోలీస్.. పోలీస్.. తెలంగాణ పోలీస్. ప్రాణం పంచే మనస్సున్న పోలీస్.. అంటూ చక్కని గీతాన్ని.. సంగీతం సమకూర్చి స్వయంగా పాడారు కీరవాణి. రచయిత అనంత శ్రీరామ్ పాటను రాశారు.
నిరంతరం ప్రజల రక్షణకు పాటుపడే కర్మయోగులు, కాలజ్ఞానులంటూ.. పోలీసుల విధులను మెచ్చుకున్నారు. అన్ని వేళల అండగా ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటోంది.
ఇవీచూడండి: వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం