ETV Bharat / city

Telangana Minister Sabitha : 'పాఠశాలల నిర్వహణ బాధ్యత వారిదే' - telangana education minister

రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ.. గ్రామాల్లో- పంచాయతీలు, పట్టణాల్లో- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Minister Sabitha Indra Reddy) స్పష్టం చేశారు. వీటి నిర్వహణపై అలసత్వం ప్రదర్శిస్తే సర్పంచ్​లు, ఛైర్మన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణకు నిధులు ఇస్తున్నామని తెలిపారు.

Telangana Minister Sabitha
Telangana Minister Sabitha
author img

By

Published : Oct 5, 2021, 12:05 PM IST

పాఠశాలల నిర్వహణ బాధ్యత వారిదే

రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణకు నిధులు ఇస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Minister Sabitha Indra Reddy) తెలిపారు. మూడేళ్లుగా రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు.. 2017-18లో రూ.38 కోట్లు, 2018-19లో రూ.49 కోట్లు, 2019-20లో రూ.46 కోట్లు, 2020-21లో రూ.80 కోట్లు, 2021-22 ఏడాదికి రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల కొరత వల్ల వాటి నిర్వహణ సరిగ్గా లేదని, ఆ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది... మరుగుదొడ్లు, నల్లబల్లలు వంటి వాటి నిర్వహణకు.. వారి సొంత డబ్బు వెచ్చిస్తున్న విషయంపై అసెంబ్లీ(Telangana Assembly sessions 2021)లో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Minister Sabitha Indra Reddy) సమాధానమిచ్చారు.

"గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలలు, అంగన్​వాడీలు, పీహెచ్​సీ కేంద్రాల నిర్వహణను ఆ పంచాయతీలే చూసుకోవాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వాటిని అర్బన్ లోకల్ బాడీస్​ చూసుకోవాలని చెప్పారు. చాలా గ్రామాల్లో సర్పంచ్​లు శ్రద్ధ తీసుకుని పాఠశాలల నిర్వహణ చూసుకుంటున్నారు. సర్పంచ్​లకు ఆ బాధ్యతను అప్పగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మార్గనిర్దేశం కూడా చేశారు. ఏ సర్పంచ్​ అయినా పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోకపోతే అక్కడి హెడ్​మాస్టర్ ఫిర్యాదు చేసి మా దృష్టికి తీసుకువస్తే మేం చర్యలు తీసుకుంటాం."

- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

పాఠశాలల మైదానం విశాలంగా ఉంటే పిల్లలకు ఇబ్బంది లేకుండా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయొచ్చని కలెక్టర్లకు తామే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సబిత(Telangana Minister Sabitha Indra Reddy) తెలిపారు. పాఠశాల ఆవరణలో పార్కు ఉంటే విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో తక్కువ విద్యార్థులు.. ఎక్కువ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తక్కువ ఉండి.. విద్యార్థులు ఎక్కువ ఉన్న పరిస్థితులున్నాయన్న మంత్రి.. ముందు ఆ పోస్టులను సర్దుబాటు చేసిన తర్వాత విద్యావాలంటీర్ల గురించి ఆలోచిస్తామని సబితా ఇంద్రారెడ్డి(Telangana Minister Sabitha) స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.