ETV Bharat / city

జూ​.ఎన్టీఆర్​ను చూడాలి.. మంచానికి పరిమితమైన ఓ అభిమాని కోరిక! - జూనియర్​ ఎన్టీఆర్​ను చూడాలని

9 నెలల వయసులో వెన్నెముకకు తగిలిన గాయం.. ఆ యువకుడిని కదల్లేని స్థితికి తీసుకొచ్చింది. ఆడుతూ.. పాడుతూ.. తిరుగుతూ.. అందరి పిల్లల్లా చదువుకోవాల్సిన వయసులో మంచానికే పరిమితమయ్యాడు. అతడి వైద్యం కోసం తల్లిదండ్రులు తమకున్న 60 సెంట్ల పొలంతో పాటు ఓ ఇంటినీ అమ్మేశారు. అయినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మంచానికే పరిమితమైనా సినిమాలు ఎక్కువగా చూసే ఆ యువకుడు జూ.ఎన్టీఆర్​కు అభిమానిగా మారిపోయాడు. చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో యవకుడి నరాలు బిగుసుకుపోయాయని.. తనకిష్టమైన హీరోను చూస్తే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించటంతో ఎలాగైనా జూ.ఎన్టీఆర్​తో ఓసారి కలిపించాలని అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

కల తీరేనా.. జూనియర్ ఎన్టీఆర్​ను చూడాలని వికలాంగ అభిమాని ఎదురుచూపు

author img

By

Published : Jul 16, 2022, 10:02 PM IST

ఆడుతూ.. పాడుతూ.. తిరుగుతూ.. అందరి పిల్లల్లా చదువుకోవాల్సిన వయసులో ఆ బాలుడు మంచానికే పరిమితమయ్యాడు. చిన్నప్పుడు వెన్నెముకకు తగిలిన గాయం.. కదల్లేని స్థితికి తెచ్చింది. వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా.. ఫలితం లేకపోయింది. ఏపీలోని గుంటూరు మండలం పొత్తూరుకు చెందిన గుమ్మడి విజయేంద్రమణి, హనుమంతరావు దంపతుల కుమారుడు సుమన్ పరిస్థితి ఇది. హనుమంతరావు, విజయేంద్రమణిల కుమారుడు సుమన్. ఆయన ఓ పొగాకు కంపెనీలో ఉద్యోగిగా చేస్తున్నారు. ఆమె మాత్రం ఇంటివద్దే ఉంటుంది. సుమన్ 9 నెలల వయసులో మంచంపై నుంచి కింద పడ్డాడు. అప్పటి నుంచి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. చాలా మంది వైద్యులకు చూపించినా.. ఫలితం లేకపోయింది. ప్రస్తుతం సుమన్ వయసు 22 ఏళ్లు. మామూలు పిల్లాడిలా ఎప్పుడు మారతాడా అని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆకలైనా.. దప్పికైనా, విసర్జనకు వెళ్లాలన్నా సైగల ద్వారానే తెలియజేస్తాడు. అన్ని పనులు తల్లి లేదా సోదరి చూసుకోవాలి. సుమన్ తల్లి ఆరోగ్యం కూడా సరిగా లేకపోవటంతో ఇటీవల ఎక్కువగా సోదరి ఇంటి వద్ద ఉంటున్నారు.

గుంటూరు, విజయవాడలో పలు ఆసుపత్రుల్లో సుమన్​ను చూపించారు. బాబు వైద్యం కోసం తమకున్న 60 సెంట్ల పొలంతో పాటు ఓ ఇంటినీ అమ్మేశారు. ఆర్థికంగా ఎవరైనా ఆదుకుంటే సుమన్​కు మళ్లీ వైద్యం చేయించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. "మా అబ్బాయి సినిమాలు చూస్తాడు. పాటలు వింటాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే వాడికి చాలా ఇష్టం. డైలాగులు చెప్పేందుకు సైగల ద్వారా ప్రయత్నిస్తాడు. సెల్​ఫోన్​లో జూనియర్ ఫొటోలను చూడటంతో పాటు వాటిని వీడియోలుగా మారుస్తుంటాడు. కింద పడినప్పుడు షాక్​కు గురై.. సుమన్ శరీరంలోని నరాలు బిగిసుకుపోయాయి. తనకిష్టమైన హీరోని చూస్తే సుమన్ మళ్లీ మామూలు స్థితికి వస్తారని వైద్యులు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్​తో ఓసారి కలిపించాలని అనుకుంటున్నాం." అని తండ్రి హనుమంతరావు అన్నారు.

ఇవీ చూడండి..

ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్దీప్ ధన్​కడ్

'ఇకపై అలా జరగదు.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ తింటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.