రైతులకు మేలు చేకూర్చడానికే సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గడిచిన ఆరున్నరేళ్లుగా రైతులకు కేసీఆర్ ఎంతో చేశారని పేర్కొన్నారు. పలు పథకాల ద్వారా ఆడపడుచులకు అండగా ఉన్నారని వివరించారు.
కేసీఆర్ కిట్ రూపంలో గర్భిణీలకు చేయూతనిస్తున్నారని తలసాని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు మేలు జరుగుతోందని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ