ETV Bharat / city

చార్మినార్​కు పూర్వవైభవం... కిటకిటలాడుతున్న పరిసరాలు - charminar open

కరోనా వల్ల హైదరాబాద్​లో చాలా రోజులుగా బోసిపోయిన చార్మినార్​ ఇప్పుడు మళ్లీ చమ్​కాయిస్తోంది. సందర్శకులతో పాటు వ్యాపారులతో పరిసరప్రాంతాలన్ని కిటకిటలాడుతున్నాయి. చార్మినార్​ పరిసరాల్లో మళ్లీ పూర్వవైభవం వచ్చేసింది.

charminar open after long time in hyderabad
చార్మినార్​కు పూర్వవైభవం... కిటకిటలాడుతున్న పరిసరాలు
author img

By

Published : Oct 2, 2020, 8:40 PM IST

అన్​లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని మినహాయింపులు కల్పించటం వల్ల పలు ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. చారిత్రక చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు శుక్రవారం ఉదయం నుంచే ప్రారంభించారు. పర్యాటక ప్రాంతమైన చార్మినార్​... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో కిటకిటలాడింది.

చార్మినార్ ప్రాంతాల్లో అమ్మే వస్తువుల కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వాణిజ్య కార్యకలాపాలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. 4 నెలలుగా వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతో రోజులు గడుపుతున్న వ్యాపారులకు ఈ అన్​లాక్​తో కొంత ఊరట దొరికినట్లయింది.

ఇదీ చూడండి: స్వచ్ఛ భార‌త్‌లో రాష్ట్రానికి మొదటిస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.