సమాజంలోని అన్నివర్గాల్లో సమానత్వాన్ని తీసుకురావడంలో అంబేడ్కర్ చేసిన కృషి నిరుపమానమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలను నిర్వహించారు. బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఇతర నేతలు హాజరై బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
మే 3 వరకు పొడగించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు.
ఇవీచూడండి: అంబేడ్కర్ ఆలోచనలే దేశానికి రక్ష: భట్టి