Bandi sanjay Comments: దేశం గర్వించేలా రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ను అవమానించిన ఘనత కాంగ్రెస్, తెరాసకే దక్కిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి... నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో దేశంలో భాజపా పాలన సాగిస్తోందని బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఏనాడు అంబేడ్కర్‌ను గౌరవించకపోగా.. రాజ్యాంగాన్ని మార్చాలంటూ మహనీయుడిని అవమానిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆటలను భాజపా సాగనీయదని హెచ్చరించారు.
"అంబేడ్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించాలి. ముఖ్యమంత్రి అయిన ఏడేళ్లలో ఒక్కసారి కూడా ఆ మహానీయునికి నివాళులు అర్పించలేదు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెడతానని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠించే స్థలాన్ని భాజపా పరిశీలించాకే.. ప్రభుత్వంలో చలనం వచ్చింది. కల్వకుంట్ల రాజ్యాంగం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: