Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం రూ.420 మేర పడిపోయింది. ప్రస్తుతం బంగారం రూ.55,610 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.68,800 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.55,610గా ఉంది. కిలో వెండి ధర రూ.68,800 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,610 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,800గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,610గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,800వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,610 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,800గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,787 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.30 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,91,412 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.13,91,412 |
ఇథీరియం | రూ.1,02,610 |
టెథర్ | రూ.82.36 |
బైనాన్స్ కాయిన్ | రూ.23,304 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.63 |
స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో సెన్సెక్స్ భారీ నష్టంతో ప్రారంభమైంది. ఉదయం 495 పాయింట్లు కోల్పోయిన సూచీ.. అనంతరం కోలుకుంది. ప్రస్తుతం ఊగిసలాట మధ్య స్వల్ప లాభంతో 62,170 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 షేర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పేంట్స్ షేర్లు డీలా పడ్డాయి. మరోవైపు, నిఫ్టీ సైతం ఊగిసలాట మధ్యే ట్రేడవుతోంది. ప్రస్తుతం 14 పాయింట్ల స్వల్ప లాభంతో 18,510 వద్ద కదలాడుతోంది.
రూపాయి విలువ:
రూపాయి విలువ 35 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం ప్రస్తుతం రూ. 82.63కు చేరింది.