దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెషన్ ఆరంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు.. కాసేపటికే సానుకూలంగా ట్రేడయ్యాయి. అయితే.. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 114 పాయింట్లకుపైగా కోల్పోయి 60,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18వేల దిగువకు చేరింది.
ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. ఐటీ షేర్లు రాణిస్తున్నాయి.