ETV Bharat / business

అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్లకు కీలకం! - ఫెడ్​ వడ్డీ రేట్లు

అంతర్జాతీయ పరిణామాలు ఈవారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్ల ప్రకటనపై కూడా మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

market outlook
మార్కెట్​ అవుట్​ లుక్​
author img

By

Published : Aug 22, 2021, 4:29 PM IST

దేశీయంగా మార్కెట్​ను ప్రభావితం చేసే వార్తలు ఏమీలేని వేళ.. ఈ వారం సూచీలను అంతర్జాతీయ పరిణామాలే ముందుకు నడిపించనున్నాయి. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్ల ప్రకటనలు మార్కెట్​ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇదే క్రమంలో త్వరలో ముగియనున్న ఆగస్టు డెరివేటివ్​ కాంట్రాక్ట్​లతో మార్కెట్​ కొంతమేర ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి, పెరుగుతున్న కేసులు, చైనా రెగ్యులేటరీ క్రాక్​డౌన్​ వంటి అంశాలపై మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

"మార్కెట్​ను ప్రభావితం చేసే వార్తలు ఈ వారంలో దేశీయంగా లేవు. దీంతో అంతర్జాతీయ పరిణామాలపైనే మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉంది. కరోనా కేసుల్లో పెరుగుదల, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా సూచీలను కలవర పెట్టే అవకాశం ఉంది."

-వినోద్​ నాయర్​, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్

ఈ వారంలో అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్​లను ముందుకు నడిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడం, అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్ల అంశాలు కొంతమేర ప్రభావం చూపిస్తాయి.

-సిద్ధార్థ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.

వీటన్నింటితోపాటు రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి: Credit card: ఈ 'క్రెడిట్​ కార్డు'కు 3 నెలల పాటు వడ్డీ ఉండదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.