ఐటీఆర్ దాఖలుకు మళ్లీ గడువు పెంపు..
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ గడువు నవంబర్ 30తో ముగియాల్సి ఉంది.
అడిట్ అవసరమైన వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ గడువును జనవరి 31వరకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
మేలోనూ గడువు పెంపు..
నిజానికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31 వరకే గడువు ఉంది. కరోనా నేపథ్యంలో ఈ గడువును నవంబర్ 30 వరకు పెంచుతున్నట్లు మేలో ప్రకటించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).