బ్యాంకింగ్ రంగంలో అధునాతన సాంకేతికత వినియోగిస్తాం: నిర్మల
బ్యాంకులు ఇచ్చే వాణిజ్య రుణాల్లో కేంద్రప్రభుత్వ జోక్యం ఉండదు: నిర్మల
విలీనాల తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఎస్‌బీఐ, రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ
16:53 August 30
అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ... రెండో అతిపెద్ద బ్యాంకు పీఎన్‌బీ

16:47 August 30
ఇండియా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్...
ఇండియా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ కలిసి ఏడో అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడుతుందని తెలిపారు.
16:44 August 30
బ్యాంకుల విలీనం..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం కానున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇది ఐదో అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడుతుందని పేర్కొన్నారు.
16:40 August 30
మరోసారి బ్యాంకుల విలీనం: నిర్మలా
బ్యాంకుల విలీనం అంశంపై మరో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
పీఎన్‌బీ, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు కలిసిపోతాయని సంకేతాలిచ్చారు. ఈ 3 ప్రభుత్వ బ్యాంకుల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడుతుందని స్పష్టం చేశారు. వీటి విలీనంతో రూ. 17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.
16:36 August 30
బ్యాంకింగ్ రంగం ప్రక్షాళనపై దృష్టి: నిర్మలా
బ్యాంకింగ్ రంగం ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృషి పెట్టినట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రుణాల వసూళ్లపై బ్యాంకులు మరింత దృష్టి సారించాలని పేర్కొన్నారు. గృహ రుణాల మంజూరును మరింత సరళీతరం చేస్తామని తెలిపారు.
16:27 August 30
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకింగ్ రంగంలో పలు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకుల వాణిజ్య నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ బ్యాంకులన్నీ లాభాల బాటలో పయనిస్తున్నట్లు పేర్కొన్నారు.
16:25 August 30
ఎన్‌బీఎఫ్‌సీలకు మద్దతు పొడిగింపు
16:20 August 30
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు
నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం
16:16 August 30
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చర్యలు..
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్ష చేయనున్నట్లు తెలిపారు నిర్మలా.
15:58 August 30
స్థిరాస్తి రంగంలో రాయితీలు..?
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. వృద్ధి మందగిస్తున్న పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ఇటీవల సర్‌ఛార్జీల ఉపసంహరణ, అధిక పన్నుల తగ్గింపు చర్యలు చేపట్టింది. విదేశీ పెట్టుబడులు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరోసారి ఆ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగించనున్నట్లు తెలుస్తోంది.
15:50 August 30
పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం మరోసారి బొనాంజా!
పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వినియోగం పెరిగేలా తగు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.