ETV Bharat / business

'ముహురత్​ ట్రేడింగ్'​కు సిద్ధమా? - muhurat trading historical data

సాధారణంగా స్టాక్ మార్కెట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. శని, ఆది వారాలతో పాటు పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో కూడా కార్యకలాపాలు ఉండవు. అయితే దీపావళి నాడు సెలవు దినం అయినప్పటికీ ఒక గంట పాటు స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుపుకోవచ్చు. దీన్నే ముహురత్ ట్రేడింగ్ అంటారు. అసలు ఎందుకు ఈ ట్రేడింగ్ నిర్వహిస్తారు? దీని గురించి తెలుసుకుందాం.

things to know about muhurat trading before investing in stocks
'ముహురత్​ ట్రేడింగ్'​కు సమయం ఆసన్నమైంది
author img

By

Published : Nov 12, 2020, 4:42 PM IST

ముహురత్ ట్రేడింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న సంప్రదాయం. ముహురత్ ట్రేడింగ్ మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. తర్వాత 1992లో జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ స్థాపించినప్పుడు అదే ఏడాది ఈ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్ తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు.

సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ చేసే ట్రేడింగ్ అని, హిందూ కొత్త సంవత్సరమైన సంవత్ ప్రారంభాన్ని చేసుకోవటం అని ట్రేడర్లు నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహురత్​ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ట్రేడింగ్ ప్రారంభమవగానే కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. ఈ గంట సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి సంవత్సరం మొత్తం ఎక్కువ లాభాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. ఈ సమయంలో కొంత మొత్తంలో కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఇస్తుందని కొంత మంది నమ్ముతుంటారు.

ఈ సారి దీపావళి నవంబర్ 14న రానుంది. ఆ రోజు సాయంత్రం 6.15 నుంచి 07:15 వరకు ముహురత్ ట్రేడింగ్ జరగనుంది. సంవత్ 2076 ముగిసి ... సంవత్ 2077 ప్రారంభంకానుంది.

2009 నుంచి నిఫ్టీ ఒక్క సారి కూడా ఈ ట్రేడింగ్ సమయంలో 1 శాతం కూడా పెరగలేదు. 2008లో ఆరు శాతం పెరిగింది.

ఇదీ చూడండి: ఆత్మనిర్భర్​ భారత్​ 3.0: ఉపాధి కల్పనకు పెద్ద పీట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.