యూఎస్ కంపెనీ- మోడెర్నా తీసుకొచ్చిన టీకాతో కొవిడ్ నుంచి పిల్లలకు భద్రత లభిస్తోంది. ఈ విషయాన్ని మోడెర్నా అధికారికంగా ప్రకటించింది. 'మా టీకాతో పిల్లలకు కరోనా ముప్పు నుంచి రక్షణ కలుగుతుంది' అని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 టీకాకు తీవ్రమైన కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లలకు టీకా ఇచ్చే పరిస్థితి లేదు.
'మా టీకా పిల్లలపై పనిచేస్తోంది'
ప్రముఖ అమెరికన్ సంస్థ మోడెర్నా.. కొవిడ్ నుంచి పిల్లలను తమ వ్యాక్సిన్ కాపాడగలదని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 టీకాకు తీవ్రమైన కొరత ఉన్న నేపథ్యంలో పిల్లలకు టీకా ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పిల్లలకు టీకా ఇవ్వటానికి కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.
!['మా టీకా పిల్లలపై పనిచేస్తోంది' modern](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11899641-thumbnail-3x2-moderna.jpg?imwidth=3840)
అయినప్పటికీ పిల్లలకు టీకా ఇవ్వటానికి కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. ఫైజర్- బయోఎన్‌టెక్ టీకాను పిల్లలకు ఇవ్వటానికి యూఎస్, కెనడా దేశాలు ఆమోదించాయి. అదే కోవలో మోడెర్నా టీకాకు కూడా అనుమతి వస్తుందని భావిస్తున్నారు. పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల సమాచారాన్ని యూఎస్ ఎఫ్‌డీఏకు సమర్పించనున్నట్లు మోడెర్నా తెలియజేసింది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులైన దాదాపు 3,700 మంది పిల్లలపై టీకాను పరీక్షించినట్లు, టీకా వల్ల వారిలో రోగ నిరోధక శక్తి ఏర్పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: '30 రోజుల్లో 30 నగరాలకు కొవాగ్జిన్ టీకాలు'