Tesla recalls: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిన్నకాక మొన్న.. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడం వల్ల 54 వేల కార్లను వెనక్కి పిలిపించిన టెస్లా.. తాజాగా 8.17 లక్షలకుపైగా కార్లను రికాల్ చేస్తోంది.
వాహనాలు స్టార్ట్ అయినప్పుడు సీట్‌బెల్ట్ రిమైండ్ చేయడంలో సమస్య తలెత్తడం వల్లే వాహనాలను వెనక్కి పిలిపిస్తోంది. టెస్లా రీకాల్ చేసిన కార్లలో మోడల్ ఎస్ సెడాన్, మోడల్ ఎక్స్ ఎస్యూవీ, మోడల్ 3, మోడల్ వై ఎస్యూవీ వాహనాలు ఉన్నాయి. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించనున్నట్లు టెస్లా పేర్కొంది.
ఇదీ చూడండి: రెడ్ సిగ్నల్ జంప్.. ఖాళీ రోడ్డుపై సడెన్ బ్రేక్.. చుక్కలు చూపిస్తున్న టెస్లా కార్లు!