అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ నడుమ స్టాక్ మార్కెట్లు గురువారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. 6 పాయింట్ల స్వల్ప వృద్ధితో సెన్సెక్స్ 40వేల 644 వద్ద ట్రేడ్ అవుతోంది. 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11వేల 986కి పడిపోయింది.
భారతీ ఎయిర్టెల్, యాక్సిక్ బ్యాంక్ షేర్లు ఒక శాతానికిపైగా..., ఎస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 0.5శాతానికిపైగా నష్టపోయాయి.
ఎల్ అండ్ టీ షేర్లు 2 శాతానికి పైగా, ఇండస్ఇండ్, హెచ్సీఎల్, ఎస్బీఐ షేర్లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
ఇదీ చూడండి: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం