దేశంలో 14 శాతం కుటుంబాలు మాత్రమే విద్యుత్ ఆదా చేసే 5 లేదా 4 స్టార్ ఏసీలను వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ఈ సర్వే నిర్వహించాయి.
ఇందులో టైర్-2 పట్టణాల్లో 93 శాతం మంది కుటుంబాలకు స్టార్ లేబులింగ్ విధానం గురించి అవగాహన ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ..14 శాతం మాత్రమే 5 లేదా 4 స్టార్ ఏసీలను కొనుగోలు చేశారని తేలింది. 75 శాతం మంది ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీ కొనుగోలు చేయాలనుకున్నా.. వారిని అధిక ధరలు ప్రధానంగా అడ్డుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.
ఈ నివేదిక ఆధారంగా ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్ (ఆర్సీటీ) ప్రయోగాల ద్వారా ఎక్కువ రేటింగ్ ఉన్న విక్రయాలు పెరిగేందుకు పలు సూచనలు చేశారు విశ్లేషకులు. జీఎస్టీ 28 శాతం నుంచి 5 శాతం కన్నా దిగువకు తగ్గించడం ద్వారా.. తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలతో పోటీగా 5 లేదా 4 స్టార్ ఏసీల విక్రయాలు పెరుగుతాయని అభిప్రాయయం వక్తం చేశారు.
ధన్‌బాద్, మదురై, మీరఠ్, వడోదర పట్టణాల్లో.. 400లకుపైగా కుటుంబాలపై ఈ అధ్యయనాలు జరిగాయి.
జీఎస్టీ తగ్గించడం ద్వారా తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలు, ఎక్కువ రేటింగ్ ఉన్న ఎసీల మధ్య పోటీ పెరగటం సహా.. పరిశ్రమలో ఫినాన్సింగ్ పథకానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఎక్కువ మంది 5 స్టార్, 4 స్టార్ ఏసీలను కొనుగోలు చేస్తే.. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని సీఈఈడబ్ల్యూ అభిప్రాయపడింది.
సర్వేలో తేలిన మరిన్ని విషయాలు..
- మూడో వంతు కుటుంబాలు మాత్రమే సర్వీసింగ్, నిర్వహణకు.. ఇంధన సామర్థ్యంతో సంబంధం ఉందని భావిస్తున్నారు.
- 71 శాతం కుటుంబాలు సర్వీసింగ్ కోసం 1-1.5 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడటం లేదు.
- 24 శాతం కుటుంబాలు రూ.300 కన్నా తక్కువ మొత్తాన్నే సర్వీసింగ్ కోసం కేటాయిస్తున్నారు.
- 26 శాతం మంది మాత్రమే ఏసీ సర్వీసింగ్‌తో విద్యుత్ వినియోగంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి:రిలయన్స్‌లో మరో సంస్థ భారీ పెట్టుబడి