ETV Bharat / business

ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఆరుగురు ఆన్​లైన్​లోనే..

author img

By

Published : Apr 23, 2021, 10:02 PM IST

ప్రపంచ జనాభాలో రెండింట మూడొంతుల మంది మొబైల్​ ఫోన్​ వాడుతున్నారని కెపియోస్​ అనాలసిస్​ నివేదిక వెల్లడించింది. అంతర్జాలం వినియోగిస్తున్నవారు 4.72 బిలియన్లకు చేరుకున్నట్లు తెలిపింది. అంటే.. ప్రతి 10 మందిలో ఆరుగురు ఆన్​లైన్​లోనే ఉంటున్నారని పేర్కొంది.

Internet users around the world
అంతర్జాల వినియోగదారులు

మొబైల్​.. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ మానవ జీవితాలను శాసించే స్థాయికి చేరుకుంది. మొబైల్​ ఫోన్​ రాకతో అంతర్జాల వినియోగం భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మొబైల్​ వినియోగిస్తున్నారు. అందులో ఇంటర్​నెట్​ వాడుతున్నవారెందరు అనే విషయాలపై మార్కెటింగ్​ కన్సల్టెన్సీ సంస్థ కెపియోస్​ అనాలసిన్​ ఓ నివేదిక విడుదల చేసింది. గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల మందికిపైగా అంతర్జాల వినియోగదారులు పెరిగినట్లు వెల్లడించింది.

నివేదికలోని కీలక అంశాలు..

  • 2021, ఏప్రిల్​ నాటికి ప్రపంచ జనాభా సుమారు 7.85 బిలియన్లుగా ఉంది. అందులో 5.27 బిలియన్ల మంది మొబైల్​ వినియోగిస్తున్నారు. అంటే.. భూమండలంపై నివసిస్తున్న ప్రజల్లో రెండింట మూడొంతుల మంది మొబైల్​ ఫోన్​ వాడుతున్నారు.
  • గత ఏడాదిలో అంతర్జాలం వినియోగించే వారు 7.6 శాతం (33 కోట్లు) వృద్ధితో 4.72 బిలియన్లకు చేరుకున్నారు. అది ప్రపంచ జనాభాతో పోల్చితే.. 60 శాతానికి పైమాటే.
  • ప్రపంచవ్యాప్తంగా ఇంటర్​నెట్​ వాడుతున్న వారిలో 21 శాతంతో చైనా తొలి స్థానంలో ఉండగా.. 13 శాతంతో భారత్​ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో కేవలం 6.3 శాతం మాత్రమే అంతర్జాలం వాడుతున్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఆరుగురు ఆన్​లైన్​లో ఉంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో..

  1. గత 12 నెలల్లో 50 లక్షల మంది కొత్తగా సామాజిక మాధ్యమాల్లో చేరారు. 2021, ఏప్రిల్​ నాటికి సోషల్​ మీడియా వినియోగదారుల సంఖ్య మొత్తం 4.33 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాతో పోలిస్తే.. అది 55శాతానికిపైగా ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గణాంకాలు.. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం వృద్ధి చెందాయి.
  2. గత ఏడాది కాలంలో చైనాలో 85 మిలియన్ల మంది కొత్తగా సామాజిక మాధ్యమాల్లో చేరారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా సోషల్​ మీడియాలో చేరిన ప్రతి ఆరుగురిలో ఒకరు చైనాలోనే ఉన్నారు. అలాగే.. భారత్​, ఇండోనేసియా, బ్రెజిల్​లోనూ సామాజిక మాధ్యమ వినియోగదారులు గణనీయంగా పెరిగారు.
  3. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్​కు​ ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. కానీ, ఇప్పటికీ ఫేస్​బుక్​ అత్యధిక యూజర్లతో తొలిస్థానంలో కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం నెలకు 2.8 బిలియన్ల మంది ఫేస్​బుక్​లో చేరుతున్నారు.

ఇదీ చూడండి: ​ ఒంటరితనం వల్లే ఇంటర్నెట్‌ అతి వినియోగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.