సెన్సెక్స్ 300+
స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 39 వేల 881 వద్ద ఉంది. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11 వేల 740 వద్దకు చేరింది.
ఓఎన్జీసీ, రిలయన్స్, టైటాన్, యూపీఎల్, మారుతీ సుజుకీ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా డీలాపడ్డాయి.
హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు నష్టాల్లో ఉన్నాయి.
ఇతర ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలు చవిచూసిన మార్కెట్లు నెమ్మదిగా లాభాల్లోకి ఎగబాకాయి. ఉద్దీపన పథకంపై చర్చలకు ప్రస్తుతానికి స్వస్తి చెప్పనున్నట్లు ప్రకటించిన ట్రంప్ వార్త ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.