ఏటీఎంల ద్వారా కార్డ్లెస్ నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది. రోజువారీ లావాదేవీ పరిమితిని రూ.20,000గా నిర్ణయించింది.
దేశంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 15,000 ఏటీఎంలలో కార్డ్ రహిత నగదు ఉపసంహరణ సేవలను పొందవచ్చు. ఇందుకోసం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఐ-మొబైల్ ఉపయోగించాలి.
"డెబిట్ కార్డు ఉపయోగించకుండా నగదు ఉపసంహరించుకోవడానికి ఇది సరళమైన, అనుకూలమైన మార్గం."
- ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటన
సాంకేతిక పరిజ్ఞానంపై, ఆవిష్కరణలపై తమ బ్యాంకు దృష్టి సారిస్తుందని, వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించడమే తమ ధ్యేయమని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి పేర్కొన్నారు.
2019 సెప్టెంబర్ 30 నాటికి ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ రూ.12,88,190 కోట్లుగా ఉంది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు మొత్తం 15 దేశాల్లో సేవలు అందిస్తోంది.
ఇదీ చూడండి: వాట్సాప్ నయా రికార్డ్- 500 కోట్లు దాటిన డౌన్లోడ్స్