ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ- ఈపీఎఫ్ఓ ఖాతా సభ్యులు తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) నెట్‌వర్క్ ద్వారా సమర్పించవచ్చని స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం కారణంగా ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)ను వారి ఇంటి వద్దకే తీసుకొని వెళ్లేలా చర్యలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అధికారులు. డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని అందించేలా ఈపీఎఫ్ఓ సీఎస్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుందని కార్మిక మంత్రత్వశాఖ స్పష్టం చేసింది.
సుమారు 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు కార్మిక శాఖ చెబుతోంది. వీరంతా దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్సీల ద్వారా జీవిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు.
ఎక్కడైనా.. ఎప్పుడైనా..
పెన్షన్ను ఉపసహరించుకోవాలంటే వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని ఏటా సమర్పించాలని సమర్పించాల్సి ఉంటుంది. అయితే సీఎస్సీలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ , 117 జిల్లా కార్యాలయాలు, పెన్షన్ నగదు ఇచ్చే బ్యాంకుల్లో ఈ పత్రాన్ని అందివ్వచ్చని స్పష్టం చేసింది.
ఈ పత్రాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా ఇవ్వవచ్చని తెలిపింది. ఈపీఎఫ్ఓకు సమర్పించిన రోజు నుంచి ఏడాది పాటు ఈ పత్రం చెల్లుతుందని పేర్కొంది. ఇంతకుముందు నవంబర్లోనే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి వచ్చేది.
పెన్షనర్లు వారికి అనుగుణంగా ఉన్న డెలీవరీ ఎజెన్సీని ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఈపీఎఎఫ్ఓ.