ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. ఉద్యోగుల సౌకర్యార్థం వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించింది. దీనిద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కలుగుతుందని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.
ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ఏఎంఎస్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలకు అదనంగా ఇప్పుడు 24 గంటలపాటు పనిచేసే వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను కూడా ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. కొవిడ్-19 వేళ నిరంతరాయ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఓ ప్రకటనలో చెప్పింది.
ఈ సదుపాయం ద్వారా పీఎఫ్ చందాదారులు ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని అధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపి తమ సమస్యలను పరిష్కరించుకొనే వీలుంటుంది. ఈపీఎఫ్ఓకు చెందిన 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇదీ చూడండి: 'సెప్టెంబర్‌లో 24శాతం పెరిగిన నియామకాలు'