ETV Bharat / bharat

కొత్త ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్!

నూతన వ్యక్తిగత గోప్యత విధానంపై దిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వివరణ ఇచ్చింది. కొత్త పాలసీని అంగీకరించేలా వినియోగదారులను ఒత్తిడి చేయమని స్పష్టం చేసింది.

delhi high court whatsapp, వాట్సప్​ ప్రైవసీ దిల్లీ హైకోర్టు
కొత్త ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్!
author img

By

Published : Jul 9, 2021, 12:42 PM IST

Updated : Jul 9, 2021, 2:22 PM IST

కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో మెసేజింగ్ యాప్​ వాట్సాప్ ఎట్టకేలకు దిగొచ్చింది. సమాచార భద్రతా బిల్లు అమలులోకి వచ్చే వరకు నూతన వ్యక్తిగత గోప్యత విధానాలను ఆమోదించాలని వినియోగదారులను ఒత్తిడి చేయబోమని తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీలపై దిల్లీ హైకోర్టు విచారణలో ఈ మేరకు వివరణ ఇచ్చింది వాట్సాప్.

వాట్సాప్ ప్రైవసీ పాలసీని ఆమోదించకుంటే.. సేవలను పరిమితం చేసే అంశంపైనా వాట్సాప్ వెనక్కి తగ్గింది. యూజర్లు అందరికీ ఒకే రకమైన సేవలను అందిస్తామని.. అప్​డేట్స్ కూడా ఇస్తామని పేర్కొంది. ఈ విషయంపై ఇది వరకే స్పష్టతనిచ్చినప్పటికీ.. కొత్త ప్రైవసీ పాలసీ గురించి నోటిఫికేషన్​ పంపిస్తామని గత నెలలో వాట్సాప్ పేర్కొంది. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది.

ప్రైవసీ పాలసీని ఇటీవలే వాట్సాప్ అప్​డేట్​ చేసింది. కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేయాలంటూ యూజర్లకు తరచూ నోటిఫికేషన్లు పంపిస్తోంది. ఇలా చేయడం ద్వారా కొత్త పాలసీని ఆమోదించేలా వినియోగదారులను వాట్సాప్ ఒత్తిడి గురిచేస్తోందంటూ ఇటీవల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

ఇదీ చదవండి : ట్విట్టర్‌కు కొత్త మంత్రి వార్నింగ్‌- రూల్స్ తప్పితే..

Last Updated : Jul 9, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.