ETV Bharat / bharat

అత్తారింటిపై కోపంతో టీలో విషం కలిపి ఇచ్చిన కోడలు - విషం కలిపిన టీ తాగి ఉత్తర్​ప్రదేశ్​లో

అత్తింటివారిపై కోపం పెంచుకుంది ఓ మహిళ. అందరినీ ఒకేసారి చంపేయాలని ప్లాన్ వేసింది. పక్కా ప్రణాళికతో టీలో విషం కలిపింది. ఈ ఘటనలో ఓ బాలుడు మృతిచెందగా.. మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

woman serves poisonous tea
టీలో విషం కలిపి
author img

By

Published : Aug 24, 2021, 9:18 AM IST

కొత్తగా పెళ్లై.. అత్తింట్లోకి అడుగుపెట్టిన మహిళ.. కొద్ది కాలంలోనే తన భర్త కుటుంబంపై కక్ష పెంచుకుంది. పథకం ప్రకారం టీలో విషం కలిపి.. కుటుంబసభ్యులందరికీ ఇచ్చింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలి వదిన కుమారుడు మరణించగా.. మిగతావాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భర్తలేని సమయంలో..

అనిత, పూరన్​ దంపతులు. వీరికి గతేడాది డిసెంబర్​లో వివాహం జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​, బహ్రాయిచ్, దెహత్ స్టేషన్​ పరిధిలోని మచియాహీ గ్రామంలో నివాసం ఉంటున్నారు.​ వివాహం జరిగిన కొన్ని నెలలకే అత్తింటివారిపై కోపం పెంచుకుంది అనిత. అయితే సోమవారం భర్త.. ఇంట్లో లేనప్పుడు.. విషం కలిపిన టీని అందరికి అందించింది. టీని సేవించిన అనిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు సృష్టి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే శివాని కుమారుడు శివనాథ్(18 నెలలు) మాత్రం మృతిచెందినట్లు బహ్రాయిచ్ అదనపు ఎస్పీ కున్వార్ జ్ఞానాంజయ్ సింగ్ తెలిపారు. కుటుంబసభ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదుచేసి అనితను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

ఇదీ చదవండి: భర్త చికెన్ తిన్నాడని.. భార్య సూసైడ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.