ETV Bharat / bharat

TDP Nara Lokesh Call : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు 'కాంతితో క్రాంతి'.. రాత్రి 7 నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేయాలి : లోకేశ్ - We Support Babu

TDP Nara Lokesh టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో మరో వినూత్న నిరసనకు పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. శనివారం రాత్రి 'కాంతితో క్రాంతి' పేరుతో కార్యక్రమం చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. ఇప్పటికే నారా బ్రాహ్మణి పిలుపు మేరకు సెప్టెంబర్ 30న మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించగా అనూహ్య స్పందన లభించడం విదితమే.

tdp_nara_lokesh_call
tdp_nara_lokesh_call
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 1:26 PM IST

TDP Nara Lokesh Call: ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీకట్లో నిర్బంధించారన్న లోకేశ్.. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 'కాంతితో క్రాంతి' పేరుతో కార్యక్రమం చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. ప్యాలెస్​లో ఉన్న జగనాసురుడి కళ్లు బైర్లు కమ్మేలా.. 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రి 7 నుంచి 7.05 వరకు విద్యుత్ లైట్లు ఆర్పేసి నిరసన తెలపాలని లోకేశ్ సూచించారు. చంద్రబాబుకు మద్దతుగా దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వేసి సంఘీభావం తెలపాలని కోరారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి టార్చి లైట్లు వెలిగించాలని, రోడ్లపై ఉంటే వాహనం లైట్లు బ్లింక్(ఆన్, ఆఫ్) చేసి బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేశ్ తెలిపారు.

Protests Against Chandrababu Arrest: చంద్రబాబును విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

నారా లోకేశ్ మరి కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్నారు. అమరావతి (Amaravati) నుంచి రాజమహేంద్రవరం బయలుదేరిన నారా లోకేశ్.. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. లోకేశ్ తో పాటు కుటుంబసభ్యులు ములాఖత్ కానుండగా.. పార్టీకి సంబంధించిన పలు అంశాలు చంద్రబాబుతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా జనసేనతో సమన్వయానికి ఐదుగురు సభ్యులను చంద్రబాబు, లోకేశ్ ఖరారు చేయనున్నారు.

లోకేశ్​ను కలిసేందుకు రాజమండ్రి తరలివస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద దేవినేని ఉమ, కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ వెంట రాజమండ్రి వెళ్లకూడదంటూ అడ్డుకోవడంతో.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. లోకేశ్ ను కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తల వాహనాలపై పోలీసుల ఆంక్షలు (Police restrictions) విధించారు. నేతలు ఎవరూ కూడా లోకేశ్ తో కలిసి రాజమండ్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ACB Court Hearing in CBN Bail Petition: చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చిన 'మోత మోగిద్దాం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దద్దరిల్లింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సహా వేలాదిమంది యువత 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు, పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పళ్లాలు, డప్పులు, ఈలలు, హారన్ల శబ్దాల మోత మోంగింది.

గత నెల 30న శనివారం రాత్రి 7 నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి.. విజిల్ ఊది, డప్పు కొట్టి శబ్దాలు చేశారు. దిల్లీలో ఉన్న నారా లోకేశ్ 5 నిమిషాలపాటు గంట మోగించి నిరసన తెలిపారు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని గంటలు, పళ్లాలు, డప్పు శబ్దాలతో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడి నివాసంలో డ్రమ్స్ కొట్టి 'మోత మోగిద్దాం' కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు.

Nimmakuru people met with Nara Bhuvaneswari: 'రాజమహేంద్రవరం తరలివచ్చిన నిమ్మకూరు'.. ఆడపడుచు భువనమ్మకు సంఘీభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.