ETV Bharat / bharat

అంగవైకల్యం ఉన్నా స్విమ్మింగ్​లో కింగ్- ఈదుతూ నదిని దాటేసిన బాలుడు

Specially Abled Kerala Boy Swims: అంగవైకల్యంతోనూ ఈత కొడుతూ ఎందరికో స్ఫూర్తినింపుతున్నాడు కేరళకు చెందిన మహమ్మద్ అసీమ్(15). గంటలో కిలోమీటరు దూరం ఈది అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Specially Abled Kerala Boy Swims
అంగవైకల్యంతోనే స్విమ్మింగ్
author img

By

Published : Jan 28, 2022, 11:15 AM IST

Updated : Jan 28, 2022, 1:34 PM IST

అంగవైకల్యం ఉన్నా స్విమ్మింగ్​లో కింగ్

Specially Abled Kerala Boy Swims: ఏదైనా సాధించాలన్న పట్టుదల ముందు అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించాడు కేరళకు చెందిన యువకుడు. ఈత నేర్చుకున్న రెండు వారాల్లోనే నదిని ఈదేశాడు.

Specially Abled Kerala Boy Swims
పెరియార్ నదిలో ఈత కొడుతున్న అసీమ్
Specially Abled Kerala Boy Swims
వసీమ్ ఈత కొడుతున్న దృశ్యాలను తిలకిస్తున్న ప్రజలు

కోజికోడ్ జిల్లా వెలిమన్నా గ్రామానికి చెందిన మహమ్మద్ అసీమ్​కు(15) పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కాళ్లు కూడా నడిచేందుకు సమానంగా లేవు. కానీ స్విమ్మింగ్​పై తనకున్న ఆసక్తిని మాత్రం వదల్లేదు. కేవలం 14 రోజుల్లోనే ఎంతో కష్టపడి ఈత నేర్చుకున్నాడు.

గంటలో కిలోమీటరు ఈది..

గంటలో కిలోమీటరు దూరం పెరియార్ నదిలో ఈదుతూ నది అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ దృశ్యాలను చూసిన కోజికోడ్ ఎమ్మెల్యే, గ్రామస్థులు అసీమ్​పై పూలమాలలు వేసి సత్కరించారు.

Specially Abled Kerala Boy Swims
వసీమ్​ను సత్కరిస్తూ..
Specially Abled Kerala Boy Swims
మీడియాతో మాట్లాడుతున్న మహమ్మద్ వసీమ్

"నాకు స్విమ్మింగ్​లో శిక్షణ ఇచ్చినందుకు కోచ్​కు ధన్యవాదాలు. దివ్యాంగ పిల్లలు లోపాల గురించి దిగులుపడకుండా అందరిలానే జీవించాలి" అని అన్నాడు అసీమ్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం.. వారు కూడా టీకాకు అర్హులే!

Last Updated : Jan 28, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.