Sharad Pawar Death Threat : ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆగంతుకుల నుంచి వచ్చిన బెదిరింపు సందేశం కలకలం రేపింది. ఈ మేరకు ఆ పార్టీ శుక్రవారం వెల్లడించింది. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తన తండ్రి పవార్‌ను బెదిరిస్తూ గురువారం తనకు వాట్సాప్ సందేశం వచ్చినట్లు ఆయన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. నరేంద్ర దభోల్కర్ మాదిరిగానే పవార్‌ను కూడా చంపనున్నట్లు బెదిరించారని చెప్పారు. సుప్రియాసూలే పార్టీ కార్యకర్తలతో కలిసి ముంబయి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెదిరింపు సందేశాల స్క్రీన్షాట్లను కూడా సమర్పించారు.
Supriya Sule Sharad Pawar Death Threat Case : అనంతరం మీడియాతో మాట్లాడిన సుప్రియా సూలే.. ఈ విషయంలో మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి త్వరితగతిన జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవార్ జాతీయస్థాయి నాయకుడని.. ఆయన భద్రత బాధ్యత కేంద్ర హోం శాఖదే అని అన్నారు. ఇలాంటి బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రియా సూలే డిమాండ్ చేశారు. శరద్ వార్‌కు వచ్చిన బెదిరింపు సందేశంపై కేసు నమోదు చేసి.. ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సౌత్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.
మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌ను.. 20 ఆగస్టు 2013న పుణెలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండదగులు కాల్చి చంపారు.
-
#WATCH | NCP MP Supriya Sule met Mumbai Police Commissioner earlier today after her father and party's president Sharad Pawar received threatening messages.
— ANI (@ANI) June 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video: NCP PRO) https://t.co/sO4h12AXIS pic.twitter.com/x26n96jxHh
">#WATCH | NCP MP Supriya Sule met Mumbai Police Commissioner earlier today after her father and party's president Sharad Pawar received threatening messages.
— ANI (@ANI) June 9, 2023
(Video: NCP PRO) https://t.co/sO4h12AXIS pic.twitter.com/x26n96jxHh#WATCH | NCP MP Supriya Sule met Mumbai Police Commissioner earlier today after her father and party's president Sharad Pawar received threatening messages.
— ANI (@ANI) June 9, 2023
(Video: NCP PRO) https://t.co/sO4h12AXIS pic.twitter.com/x26n96jxHh
ఈ ఘటనపై ఎన్సీపీ సీనియర్ నేత అజయ్ పవార్ స్పందించారు. ఆ బెదిరింపు సందేశం పంపించింది సౌరభ్ పింపాల్కర్ అనే వ్యక్తి అని.. అతడు బీజేపీ అనుకూలవాది అని అతడి సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే అర్థమవుతోందని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే బదులు.. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా, గౌరవంగా ఎదుర్కోవాలని హితవు పలికారు.
మరోవైపు బెదిరింపు విషయం తెలుసుకున్న కార్యకర్తలు.. సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తున్నారని ఎస్పీసీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే తెలిపారు. 'శరద్ పవార్‌కు హాని జరిగితే అది లౌకికవాదానికి హానికరం. ఈ బెదిరింపు సందేశం విషయంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. లౌకికవాదం శరద్ పవార్ ఆత్మ. అలాంటి సెక్యులర్ వైఖరిని మార్చుకోమని పవార్‌ను ఎవరూ బలవంతం చేయలేరు. ఇలాంటి బెదిరింపులు ఆయనను ప్రభావితం చేయలేవు. ఇప్పుడు పవార్ భద్రత బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం లౌకికవాదాన్ని ప్రోత్సహిస్తుందా? రాజ్యాంగాన్ని సమర్థిస్తుందా? లేదా దభోల్కర్ హంతకులకు స్వేచ్ఛను ఇస్తుందా అనేది వేచి చూడాలి' అని మహేశ్ వ్యాఖ్యానించారు.
శరద్ పవార్ బెదిరింపు సందేశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే స్పందించారు. 'సీనియర్ నాయకులు శరద్ పవార్‌కు వచ్చిన బెదిరింపులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నేను స్వయంగా సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడి దర్యాప్తు చేయమని సూచించాను. శరద్ పవార్ సీనియర్ నాయకుడు.. మేమంతా ఆయనను గౌరవిస్తాం. ఆయన భద్రతపై పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైతే భద్రత పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం' అని శిందే చెప్పారు.