ETV Bharat / bharat

సీడీ కేసు: హైకోర్టుకు బాధిత మహిళ తండ్రి

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళి రాసలీలల సీడీలో కనిపించిందని భావిస్తున్న మహిళ తండ్రి.. తన కుమార్తె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలను పాటించకుండా తన కుమార్తె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

CD case
సీడీకేసు: హైకోర్టుకు మహిళ తండ్రి
author img

By

Published : Apr 2, 2021, 9:12 AM IST

Updated : Apr 2, 2021, 9:47 AM IST

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళితో పాటు అసభ్యకర వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ తండ్రి.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

పరిస్థితులు, రాజీకీయాల వల్ల తన కుమార్తె బాధితురాలిగా మారిపోయిందని, ఆమె అసభ్యకర వీడియో.. అన్ని మీడియాలో ప్రసారమైందని మహిళ తండ్రి తన పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన కుమార్తెకు తెలియజేసేందుకు మాత్రమే ఆమెను తాను సంప్రదించానని చెప్పారు. సీఆర్​పీసీ 164వ సెక్షన్​లోని నిబంధనలను గాలికి వదిలేసి తన కుమార్తె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారని పిటిషన్​లో ఆయన ఆరోపించారు.

మరోవైపు.. సదరు మహిళ కుటుంబం బెల్గాం నుంచి విజయపురకు తరలివెళ్లిందని పోలీసులు తెలిపారు. అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరించిన బెంగళూరులోని ప్రాంతాన్ని పోలీసులు సందర్శించారు.

ఇదీ చూడండి:డిజిటల్​ మార్కెటింగ్​లో రాణిస్తూ విశేష గుర్తింపు

Last Updated : Apr 2, 2021, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.