ఉత్తరాదిసహా మహారాష్ట్రలో ఛఠ్ పూజ వేడుకలు (chhath puja 2021) కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగ జరిగిన ఆరురోజుల తర్వాత ఛఠ్‌పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు ఈ వేడుకల్లో భాగంగా పుణ్య స్నానాలు చేయటంతోపాటు మహిళలు ఉపవాస దీక్షలు చేస్తారు. నీళ్లల్లో నిలబడి సూర్య నారాయణస్వామికి ప్రసాదం నివేదిస్తారు. ఆ తర్వాత జలం, క్షీరముతో అర్ఘ్యం సమర్పిస్తారు. ఇవాళ ఛఠ్‌పూజ చివరిరోజు కావటంతో.. దిల్లీలోని నదీతీర (date of chhath puja 2021) ప్రాంతాలు కిటకిటలాడాయి. మహిళలు తమ కుటుంబ సభ్యులతోసహా పెద్దసంఖ్యలో ప్రత్యేక ఘాట్లకు చేరుకొని దీపారాధన చేశారు. అనంతరం ఆదిత్యున్ని ప్రార్థిస్తూ జలం, క్షీరంతో అర్ఘ్య ప్రదానం చేశారు. వివిధరకాల పండ్లు నైవేద్యంగా సమర్పించారు. నొయిడా, గోరక్‌పూర్‌లోనూ ఛఠ్‌పూజ వేడుకలు జరిగాయి.
బిహార్ రాజధాని పట్నాలోనూ ఛఠ్ పూజ వేడుకలు (bihar chhath geet) భక్తప్రపత్తులతో జరుగుతున్నాయి. సూర్యోదయానికిముందే మహిళలు నదీ తీర ప్రాంతాలకు చేరుకొని దీపారాధన చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోనూ ఛఠ్ పూజ వేడుకలు ఘనంగా జరిగాయి.
కోల్‌కతాలోనూ ఛఠ్‌పూజ వేడుకలు జరిగాయి. హుగ్లీ నదీ తీర ప్రాంతాల్లో మహిళలు సూర్యనారాయణున్ని ఆరాధించి జలం, క్షీరంతో అర్ఘ్యం సమర్పించారు. కొబ్బరికాయసహా వివిధ రకాల పండ్లు జలమాతకు నైవేద్యంగా సమర్పించారు.
ముంబయి, భువనేశ్వర్‌లోనూ ఛఠ్ పూజ వేడుకలు జరిగాయి. ఇంటిల్లిపాదికి సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు సూర్యనారాయణ్నున్ని ఆరాధించారు. జలం, క్షీరంతో అర్ఘ్య ప్రదానం చేశారు. ఛఠ్‌పూజ వేడుకలను పురస్కరించుకొని