అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,100 కోట్లు విరాళాలు వచ్చినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ వెల్లడించారు. కొన్ని చెక్కులు ఇంకా డిపాజిట్ కాలేదని.. విరాళాల లెక్క పెరగవచ్చని తెలిపారు.
42 రోజుల విరాళాల కార్యక్రమం.. ఈరోజుతో పూర్తయిందని పేర్కొన్నారు. విరాళాల కార్యక్రమాన్ని కొనసాగించాలని విదేశాల్లోని భారతీయులు కోరుతున్నారని తెలిపారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 5న భూమి పూజ చేశారు.
ఇదీ చదవండి : హరిద్వార్‌లో ఘనంగా మాఘ పూర్ణిమ వేడుకలు