ETV Bharat / bharat

ప్రభుత్వాస్పత్రిలో మహిళపై అత్యాచారం.. జాబ్​ కోసం వెళ్లిన వివాహితపై గ్యాంగ్​రేప్​ - father attempt on children

Crime News: ఆరోగ్యం బాగాలేదని వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ​ కాంట్రాక్ట్​ ఉద్యోగి. ఈ ఘటన రాజస్థాన్​లోని అజ్మేర్​లో జరిగింది. మరోవైపు, ఉద్యోగం కోసం ముంబయికి వచ్చిన ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కొందరు కామాంధులు.

rape
rape
author img

By

Published : Jun 15, 2022, 9:48 AM IST

Rape Attempt On Patient At Hospital: రాజస్థాన్​లోని అజ్మేర్​లో దారుణం జరిగింది. రక్తపోటు సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ.. వైద్యం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. చికిత్స పొందుతున్న ఆమెపై అక్కడ పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్​ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అజ్మేర్​కు చెందిన ఓ 23 ఏళ్ల మహిళ.. గత కొద్దిరోజులుగా రక్తపోటు సమస్యతో బాధపడుతుంది. ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల వైద్యం కోసం స్థానికంగా ఉన్న జేఎల్​ఎన్​ ప్రభుత్వాసుపత్రికి తన సోదరుడితో వెళ్లింది. కాసేపటికే అతడు వేరే పనిమీద బయటకెళ్లాడు. ఇదే అదనుగా తీసుకుని.. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్​ ఉద్యోగి రాజేశ్​ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి సోదరుడు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆమె నిస్సహాయ స్థితిలో పడి ఉంది. మాట్లాడే స్థితిలో కూడా లేదు. దీంతో వెంటనే అతడు వేరే ఆసుపత్రికి ఆమెను తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై అత్యాచారం
ఉద్యోగం వెతుక్కుంటూ ముంబయి వచ్చిన ఓ 19 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కొందరు కామాంధులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్​ చేశారు. "కోల్​కతాకు చెందిన ఓ 19 ఏళ్ల వివాహిత.. ఉద్యోగం కోసం తన బంధువుతో ముంబయికు వచ్చింది. కుర్లా ప్రాంతంలో ఆమెపై తన బంధువుతో పాటు మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నలుగురు నిందుతుల్ని అరెస్ట్​ చేశాం." అని పోలీసులు తెలిపారు.

మైనర్​ కుమార్తెపై అత్యాచారం.. తండ్రి అరెస్టు..
మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసినందుకుగాను 32 ఏళ్ల తండ్రిని మంగళవారం నాగ్‌పుర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, బాధితురాలు వయస్సు 12 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2020లో మొదటిసారిగా నిందితుడు.. బాలికపై దాడి చేసి అత్యాచారం చేశాడని, ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో రేప్​ చేశాడని చెప్పారు. "బాలిక తనకు ఎదురైన బాధను తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె బాధితురాలిని బంధువుల ఇంటికి పంపించింది. చివరకు ధైర్యం చేసి బాధితురాలి తల్లి తన భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచాం" అని పోలీసు అధికారి తెలిపారు.

ఇవీ చదవండి: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు.. నోరూరించే వంటకాలు.. అత్యాధునిక హంగులతో..

'ప్రేమ గుడ్డిది.. కానీ కుటుంబాన్ని బాధించేలా ఉండొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.