ETV Bharat / bharat

అసెంబ్లీలో జనాభా నియంత్రణ- మహిళల విద్యపై నీతీశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు, మీడియా సాక్షిగా క్షమాపణలు - నీతీశ్​ కుమార్​ వివాదస్పద వ్యాఖ్యలు

Nitish Kumar Controversial Comments : బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​కుమార్​.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనాభా నియంత్రణ సాధ్యం కావాలంటే మహిళలకు విద్య ఎంత అవసరమో చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి క్షమాపణలు చెప్పారు.

Nitish Kumar Controversial Comments
Nitish Kumar Controversial Comments
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 6:56 AM IST

Updated : Nov 8, 2023, 11:06 AM IST

Nitish Kumar Controversial Comments : జనాభా నియంత్రణ విషయంలో మహిళల విద్యకు ఉన్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసలేం జరిగిందంటే?

'చదువుకున్న స్త్రీలు..'
బిహార్​లో ఇటీవలే విడుదల చేసిన సమగ్ర కులగణన నివేదికపై సీఎం నీతీశ్​ కుమార్​ అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు. "భర్తల చేష్టల కారణంగా మరిన్ని జననాలు సంభవిస్తున్నాయి. అయితే చదువుకున్న స్త్రీలు వాటిని కట్టడి చేస్తున్నారు. దాంతో జననాలు తగ్గుముఖం పడుతున్నాయి" అని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 4.3 శాతం ఉండగా.. గత ఏడాది అది 2.9కి పడిపోయిందని చెప్పారు. ఈ విషయం జర్నలిస్టులతో సహా సభలోని మిగతావారికీ తెలుసని.. త్వరలో సంతానోత్పత్తి రేటు 2కు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు'
నీతీశ్​ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అవి అసభ్యంగా, పురుషాధిక్య ధోరణిని చాటేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలోని మహిళలను సీఎం అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు. నీతీశ్‌ తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే విమర్శించారు. "అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనపడుతోంది. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, వైద్యుడిని సంప్రదించాలి" అని పేర్కొన్నారు.

  • VIDEO | Bihar CM spoke on the role of educating women in population control during a debate on caste-based economic survey in the state assembly earlier today. pic.twitter.com/4ANSYmyhG1

    — Press Trust of India (@PTI_News) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సీఎం మాటల్లో ఎలాంటి తప్పు లేదు'
అయితే, సీఎం నీతీశ్‌ మాట్లాడిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​ సమర్థించారు. ఆయన మాటల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. పాఠశాలల్లో లైంగిక విద్యలో భాగంగా విద్యార్థులకు ఇలాంటి అంశాలను బోధిస్తారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే నీతూ దేవి సైతం అందుకు మద్దతు పలికారు. సులభంగా అర్థం చేసుకోవడానికి సీఎం వివరించిన తీరుపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

  • #WATCH | Patna: On Bihar CM Nitish Kumar's inappropriate comments in the assembly, Bihar Deputy CM Tejashwi Yadav says, "Let me tell you one thing. It is wrong if someone misinterprets it. The statement of the CM was regarding sex education. People are hesitant whenever the topic… pic.twitter.com/0hwWD4oqr8

    — ANI (@ANI) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం క్షమాపణలు
అయితే అసెంబ్లీలో నీతీశ్​ కుమార్​ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో నీతీశ్​ కుమార్​ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

'బీజేపీ దేశానికి చేసిందేమి లేదు.. కేవలం ప్రచారమే చేసుకుంది'.. మమతతో నీతీశ్​ భేటీ

కాంగ్రెస్​ కూటమిలోనే నీతీశ్​, తేజస్వి.. కేసీఆర్​, మమత దారెటు?

Last Updated : Nov 8, 2023, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.