ETV Bharat / bharat

'ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు.. హిందూ పెళ్లిలా కాదు!'

హిందూ మతంలో జరిగినట్లుగా.. ముస్లిం వివాహం ధార్మికమైనది కాదని కర్ణాటక హైకోర్టు Karnataka High Court) పేర్కొంది. ముస్లిం వివాహం కాంట్రాక్టుతోనే మొదలవుతుందని, అది రద్దైనప్పటికీ.. మాజీ జీవిత భాగస్వామి పట్ల బాధ్యతలు విస్మరణకు గురికావని వ్యాఖ్యానించింది.

karnataka muslim marriage
ముస్లిం వివాహం కర్ణాటక
author img

By

Published : Oct 20, 2021, 4:07 PM IST

ముస్లింల వివాహంపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం వివాహం హిందూ మతంలో జరిగినట్లుగా ధార్మికమైనది కాదని పేర్కొంది. ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు అని (Muslim Marriage Rules), అది రద్దైనప్పటికీ బాధ్యతలు రద్దు కావని వ్యాఖ్యానించింది. బెంగళూరు​కు చెందిన ఎజాజుర్ రెహ్మాన్(52) దాఖలు చేసిన పిటిషన్​పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. (Karnataka High Court judgement)

కేసు ఏంటంటే...

బెంగళూరులోని భువనేశ్వరి నగర్​కు చెందిన ఎజాజుర్ రెహ్మాన్ అనే వ్యక్తి రూ.5000 కట్నం చెల్లించి సైరా బానును వివాహం చేసుకున్నాడు. 1991 నవంబర్ 5న ముమ్మారు తలాక్ చెప్పి సైరా బానుకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరొక మహిళను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు రెహ్మాన్. ఈ క్రమంలో 2002 ఆగస్టు 24న సైరా బాను.. నిర్వహణ ఖర్చుల కోసం రెహ్మాన్​పై కేసు వేసింది.

దీనిపై బెంగళూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సైరా బాను మరో వివాహం చేసుకునేంత వరకు, లేదంటే ఇరువురిలో ఒకరు మరణించేంత వరకు రెహ్మాన్.. నెలకు రూ. మూడు వేల చొప్పున మహిళకు చెల్లించాలని ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ రెహ్మాన్.. హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్​ను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి (Karnataka High Court judge) జస్టిస్ కృష్ణ దీక్షిత్ తీర్పు చెప్పారు.

"వివాహం అనేది ఓ కాంట్రాక్టు. దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. హిందూ వివాహంలా.. ముస్లిం వివాహం ధార్మికమైనది కాదు. వివాహం రద్దు అయినంత మాత్రాన.. దాని ద్వారా తలెత్తే బాధ్యతలు, హక్కులు విస్మరణకు గురికావు. ఒప్పందంతోనే ముస్లిం వివాహం ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందమే క్రమంగా సాధారణ వివాహ స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడే కొన్ని న్యాయపరమైన బాధ్యతలు ఏర్పడతాయి. విడాకులు ఇచ్చిన మాజీ భార్యకు సాయం అందించడం అందులో ఒకటి."

-జస్టిస్ కృష్ణ దీక్షిత్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

తీర్పు సమయంలో ఖురాన్​లోని అంశాలను ప్రస్తావించారు జస్టిస్ కృష్ణ దీక్షిత్. ఫిర్యాదుదారుడికి రూ.25 వేల జరిమానా సైతం విధించారు.

ఇదీ చదవండి: లఖింపుర్ హింసపై విచారణ.. యూపీ సర్కారుపై సుప్రీం అసహనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.