ETV Bharat / bharat

Monsoon Rainfall In India 2023 : ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. వాటి కారణంగా తప్పిన ఎల్​నినో ముప్పు : వాతావరణ శాఖ - భారత్​ ఎల్​ నినో ప్రభావం 2023

Monsoon Rainfall In India 2023 : సాధారణ వర్షపాతంతోనే నైరుతి రుతుపవనాల కాలం ముగిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలతో 94.4 శాతం వర్షపాతం నమోదైందని చెప్పింది. కొన్ని సానుకూల కారకాలు ఎల్​నినో ప్రభావాన్ని తప్పించాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.

Monsoon Rainfall In India 2023
Monsoon Rainfall In India 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 10:34 PM IST

Monsoon Rainfall In India 2023 : నాలుగు నెలల నైరుతి రుతుపవనాల కాలం.. సాధారణ వర్షపాతంతో ముగిసిందని భారత వాతావరణ విభాగం శనివారం ప్రకటించింది. దేశంలో సాధారణంగా 868.6 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఎల్‌నినో పరిస్థితులను అధిగమించి 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.

El Nino Effect In India Monsoon : రుతుపవనాల కాలంలో.. 94 నుంచి 106 మధ్య వర్షపాతం రికార్డైతే.. సాధారణంగా పరిగణిస్తారు. ఈ సారి నైరుతి రుతుపవనాలతో 94.4 శాతం వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. సానుకూల కారకాలు ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించాయని చెప్పారు.

"36 వాతావరణ సబ్​డివిజన్లలో, మూడు (మొత్తం విస్తీర్ణంలో 9 శాతం) సబ్​డివిజన్లలో అధిక వర్షపాతం నమోదైంది. 26 సబ్​డివిజన్లలో సాధారణ వర్షపాతం (మొత్తం విస్తీర్ణంలో 73 శాతం), ఏడు చోట్ల తక్కువ వర్షపాతం నమోదైంది. నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, గంగాటిక్ బంగాల్, ఝార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తర్​ప్రదేశ్​, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక కేరళ తక్కువ వర్షపాతం ఉన్న ఏడు సబ్​డివిజన్లు జాబిదాలో ఉన్నాయి"
--మృత్యుంజయ మహాపాత్ర, భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌

Indian Ocean Dipole Impact On India : తూర్పు, ఈశాన్య భారతంలో 1367 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 1,115 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదు అయినట్లు మహాపాత్ర చెప్పారు. అక్కడ 18 శాతం లోటు వర్షపాతం ఉందని తెలిపారు. దేశ వాయువ్య ప్రాంతంలో సగటున 587.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 593 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు ఆయన పేర్కొన్నారు. రుతుపవనాలపై ఆధారపడి వ్యవసాయం చేసే సెంట్రల్ ఇండియాలో.. 978 మిల్లీ మీటర్లకు గాను 981.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. దేశ దక్షిణ ద్వీపకల్పంలో 8 శాతం లోటు వర్ష పాతం నమోదైందని ఐఎమ్​డీ డైరెక్టర్‌ జనరల్ వెల్లడించారు. అయితే ఈ రుతుపవనాల సీజన్​ను ఇండియన్​ ఓషియన్ డైపోల్​, జూలియన్ ఆసిలేషన్ అనే రెండు అంశాలు ప్రభావితం చేశాయని మహాపాత్ర తెలిపారు.

'ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. కానీ..' IMD ఇలా.. స్కైమెట్ అలా..

heavy rainfall in Telangana : 40 ఏళ్ల తర్వాత ఈ వేసవిలో అధిక వర్షపాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.