ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల సీఎంలతో మోదీ కీలక  భేటీ

author img

By

Published : Apr 23, 2021, 11:21 AM IST

Updated : Apr 23, 2021, 2:27 PM IST

కరోనా ఉద్ధృతంగా ఉన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. సమావేశంలో పాల్గొన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్.. దేశ రాజధానికి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఆపేస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో ఒకే టీకా.. ఒకే ధరకు అందించాలని కోరారు.

modi meeting, PM Modi holds meeting with CMs
సీఎంలతో ప్రధాని భేటీ

దేశంలో కొవిడ్ ఉద్ధృతిపై తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మోదీ.. కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కేంద్ర సహకారం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంపై సమావేశంలో చర్చించారు.

modi meeting, PM Modi holds meeting with CMs
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ

దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు.

'ప్లాంట్‌ లేకపోతే ఆక్సిజన్‌ అందదా?'

దిల్లీలో ఆక్సిజన్‌ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రధానికి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో ఉత్పత్తి ప్లాంట్‌ లేకపోతే ప్రజలకు ఆక్సిజన్‌ అందదా అని ప్రశ్నించిన కేజ్రీవాల్‌.. దిల్లీకి రావాల్సిన ట్యాంకర్లను ఆపేస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

"ప్రాణవాయువు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పెద్ద విషాదానికి దారితీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే మనల్ని మనం క్షమించుకోలేం. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ఆక్సిజన్ ట్యాంకులు దిల్లీకి రావడంలో ఎలాంటి అవరోధాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎంలందరినీ ఆదేశించండి."

- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

కేంద్రంలో ఎవరితో మాట్లాడాలో చెబితే సంప్రదిస్తానని మోదీకి కేజ్రీవాల్‌ తెలిపారు. దేశంలో ఒకే టీకా.. ఒకే ధరకు కరోనా టీకాను అందించాలని విజ్ఞప్తి చేశారు.

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

మమత గైర్హాజరు..

మోదీతో ముఖ్యమంత్రుల సమావేశానికి బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఆమె బదులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపధ్యాయ ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన మమత.. గతంలోనూ పలు సమావేశాలకు హాజరుకాలేదు.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ కొరతపై సుప్రీం సీరియస్​

Last Updated : Apr 23, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.